FbTelugu

లద్దాఖ్ ఘటనలో ఇరువైపులా మరణాలు?

ఇండియా 20 మంది, చైనా 43 మంది!

ఢిల్లీ: లద్దాఖ్ లోని గాల్వన్‌ లోయలో ఇండియా, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో రెండు దేశాలకు చెందిన సైనికులు మరణించారు.

ఇండియా నుంచి 20 మంది, చైనా నుంచి 43 మంది మరణించినట్లు వార్తలొస్తున్నాయి. ఇండియా నుంచి ఎంత మంది మరణించారనే దానిపై ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ మాత్రం పది మంది వరకు ఉండొచ్చని మంగళవారం రాత్రి ధృవీకరించింది.

సోమవారం రాత్రి గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో ఇండియా, చైనా బలగాలు బాహాబాహీకి దిగిన విషయం విదితమే. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏప్రిల్‌ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు హింసాత్మకంగా రూపాంతరం చెందాయి. 1975 తర్వాత జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడం ఇదే ప్రథమం.

You might also like