FbTelugu

ఆగస్టు వరకు ప్రాణ గండమేనా!?

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్ కోసం జనం పరుగులు పెడుతున్నారు. చాలా చోట్ల నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత ఇప్పట్లో తీరదని, ఆగష్టు మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఒ అదర్ పూనావల్లా స్పష్టం చేశారు.
జనవరి నెలలో ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇచ్చి ఉంటే ఉత్పత్తి సామర్థ్యం పెంచేవాళ్లమని, కావాల్సినంతగా సరఫరా చేసేవాళ్లమని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కరోనా సంక్షోభం నుంచి బయటపడుతుందని అందరూ ఊహించారని, అది సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచేందుకు విదేశాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నామని, జూలై నెలాఖరు కల్లా నెలకు 100 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తామని పూనావల్లా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. తమపై పలు రాష్ట్రాల నుంచి ఒత్తిడులతో పాటు ముఖ్యమంత్రులు సైతం బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన రెండు రోజుల క్రితం ప్రకటించారు కూడా. ఈ కారణాలతోనే దేశం విడిచి బ్రిటన్ లో నివాసం ఉంటున్నానని అదర్ పూనావల్లా స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.