FbTelugu

అసోంని ముంచెత్తుతున్న వరదలు.. 37కి చేరిన మృతులు

డిస్పూర్: భారత ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెతుతున్నాయి. ముఖ్యంగా అసోంలో వరదల ఉదృతి తీవ్రంగా ఉంది. ఈ వరదల ప్రభావానికి సుమారు 11 లక్షల మంది ప్రజలు గురై తీవ్ర బాధలు అనుభవిస్తుండగా.. ఇప్పటివరకు 37 మంది మరణించారు.

అసోంలోని 18 జిల్లాలు ఈ వరద ప్రభావానికి గురైనాయి. ఈ వరదలకు సుమారు 53 వేల హెక్టార్ల పంటలు తీవ్ర ప్రభావానికి గురైనాయి. వీటిపై స్పందించిన ప్రధాని మోదీ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.