FbTelugu

తెలంగాణలో మరణాలు 1.1 శాతమే: ఈటల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాపై ప్రజలు ఆందోళన పడినంతగా మరణాల సంఖ్య లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ సంరద్భంగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా మరణాల శాతం 1.1 మాత్రమే ఉందని, దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు 3శాతమని అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని అన్నారు. గ్రామాల్లో కరోనా వ్యాప్తి తక్కువగానే ఉందని అన్నారు. హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా పెరుగుతున్న ప్రాంతాలపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

You might also like