FbTelugu

మాజీ మంత్రి రామస్వామి మృతి

హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పి.రామస్వామి మృతి చెందారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, కొద్ది రోజుల పాటు మంత్రిగా విధులు నిర్వర్తించారు.

గౌలిగూడ ప్రాంతానికి చెందిన రామస్వామి స్వతహాగా క్రీడాకారుడు. మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామస్వామి మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో గొడవలు జరిగిన సందర్భంలో అక్కడ పర్యటించి హిందువులకు మనోధైర్యం చెప్పేవారని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. పేదల ఇళ్లల్లో జరిగే చావులు, పెళ్లిళ్లకు ముందుండి పనిచేసేవారని ఆయన కొనియాడారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.