FbTelugu

కుమార్తె సహా దంపతుల మృతి

గద్వాల: ధర్మవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో దంపతులతో పాటు కుమార్తె దుర్మరణం పాలయ్యారు. జాతీయ రహదారిపై లారీని తప్పించబోయి అవతలి వైపు రోడ్డుపై వస్తున్న బొలేరో వాహనాన్ని కారు బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులోని దంపతులు మురళీ మోహన్‌ రెడ్డి (45), సుజాత (40)తో పాటు వారి కుమార్తె నేహా రెడ్డి (13), కుమారుడు సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోహన్‌రెడ్డి, సుజాత చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నేహా రెడ్డి ప్రాణాలు విడిచింది. సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కోదండపురం ఎస్సై కృష్ణయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.