FbTelugu

24 గంటల్లో మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ తో చనిపోయిన తరువాత మరణ ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొన్ని రాష్ట్రాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి.

పుట్టెడు శోకంతో ఉన్న తమకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారంటూ పలువురు కేంద్రానికి తెలిపారు. వినతులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కరోనా పాజిటివ్ తో మరణిస్తే 24గంటల్లోనే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చెయ్యాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను సూచించింది. కొన్ని రాష్ట్రాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నారని తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయని పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.