FbTelugu

కరోనా చెవిపోటుతో మిలియనీర్ ఆత్మహత్య!

వాషింగ్టన్: ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించారు. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాడు. కరోనా మహమ్మారిని జయించినప్పటికీ దాని కారణంగా వచ్చిన చెవిపోటు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆయనే టెక్సాస్ రోడ్ హౌసెస్ రెస్టారెంట్ చైన్ వ్యవస్థాపకుడు కెంట్ టేలర్. వారం రోజుల క్రితమే ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఇటీవలే కరోనా వైరస్ బారినపడిన ఆయన చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తరువాత ఆయన తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆదుకునేందుకు తన జీతాన్ని విరాళంగా ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడంతో పాటు సేవా కార్యక్రమాల్లో ముందుండేవారు. కరోనా తరువాత తీవ్ర చెవిపోటుతో బాధపడ్డారు.
వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆయన చెవి నొప్పి తగ్గకపోవడంతో విసుగు చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 1993లో టెక్సాస్ రోడ్ హౌసెస్ రెస్టారెంట్ చైన్ ను ప్రారంభించిన కెంట్ టేలర్ స్వల్పకాలంలోనే పెద్ద ఎత్తున లాభాలు గడించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.