FbTelugu

పూడ్చి పెట్టాలి… దహనం చేయవద్దు

గుంటూరు: కరోనా వైరస్ బారిన పడి మృతిచెందిన ముస్లింలను దహనం చేయవద్దని, పూడ్చిపెట్టాలని ముస్లిం మత పెద్దలు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ను కోరగా అంగీకారం తెలిపారు.

ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ముస్లిం మత పెద్దలతో జిల్లా కలెక్టర్ శామ్యూల్ సమావేశం అయ్యారని డీపీఆర్ఓ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం మత ఆచారం ప్రకారం చనిపోయిన తరువాత పూడ్చిపెట్టాలని, అలా కాకుండా దహనం చేస్తున్నారని మత పెద్దలు తెలిపారు.

కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు అంత్యక్రియలు చేస్తున్నామని, ఇక నుంచి అలా జరగదని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. కరోనా తో చనిపోయిన వారి కోసం ప్రత్యేక స్మశాన వాటికను ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా, కలెక్టర్ అందుకు సమ్మతించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర మైనారిటి కమిషన్  ఛైర్మన్ ఎస్.ఎం.జియావుద్దిన్, కోవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజశేఖర్, గుంటూరు రేంజ్ ఐజి ప్రభాకరరావు, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు పి.హెచ్.డి. రామకృష్ణ, విజయరావు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ, ముస్లిం మతపెద్దలు మౌలానా మెహబూబ్, గులాం రసూల్ సాహెబ్, నియామతుల్లా, హాఫిజ్ అబ్బాస్, హాఫిజ్ ఉస్మాన్ సిద్దిఖి, ముఫ్తీ అజిజుర్ రెహమాన్  పాల్గొన్నారు.

You might also like