FbTelugu

డిసిపి రక్షిత కు మానవత్వం లేదు: ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్: మల్కాజిగిరి డిసిపి రక్షితకు మానవత్వం లేదని, లాక్ డౌన్ లో ప్రయాణించేందుకు అనుమతులు ఉన్నా ఆపివేసిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు.
తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. మా అమ్మ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో ఐసియూలో సీరియస్ గా ఉందన్నారు. ఆమెకు రక్తం కావాల్సి ఉండడంతో ములుగు నుంచి రక్తదానం చేసేవారిని రప్పించినట్లు ఆమె తెలిపారు. ములుగు జిల్లా పోలీసుల నుంచి అనుమతులు తీసుకుని హైదరాబాద్ వరకు చేరుకున్నారు.

మల్కాజిగిరి డిసిపి రక్షిత అనుమతులతో వస్తున్న వాహనాన్ని అడ్డగించారు. అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించి, పరుష పదజాలంతో దూషించిందన్నారు. అరగంట సేపు నిల్చోబెట్టి వేధింపులకు గురిచేసిందని సీతక్క ఆరోపించింది. నేను వీడియో కాల్ చేసి వివరించే ప్రయత్నం చేయగా ఎత్తలేదన్నారు. ఇలాంటి పోలీసు అధికారుల మూలంగా ప్రభుత్వ పరువు గంగలో కలుస్తున్నదన్నారు. ఈలోపు వేరే అధికారి అక్కడకు చేరుకుని, అసలు విషయం తెలుసుకుని పంపించారని తెలిపారు. మానవత్వం అనేది లేకుండా ప్రవర్తించిన అధికారి రక్షిత పై చర్యలు తీసుకోవాలని డిజిపి ఎం.మహేందర్ రెడ్డిని కోరారు. అనుమతులు ఉన్నవారిని ఆపకుండా చర్యలు తీసుకోవాలని సీతక్క కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.