FbTelugu

డబ్బుల కోసమే కాల్చేశాడు: డీసీపీ హర్షవర్థన్

విజయవాడ: బెజవాడ కారులో హత్యాయత్నం కేసు నిందితుడు వేణుగోపాల్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ హర్షవర్థన్‌ తెలిపారు. కారులోనే ముగ్గురిని సజీవదహనం చేయాలని నిందితుడు ముందుగానే పథకం వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు.

వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల్లో కృష్ణారెడ్డి, గంగాధర్‌తో వేణుగోపాల్‌ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్నాయని డీసీపీ వివరించారు. తనకు ఇవ్వాల్సిన రూ.5 కోట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని విచారణలో వేణుగోపాల్‌ చెప్పాడన్నారు. తనను అప్పుల పాలు చేసి, బజారున పడేసిన కృష్ణారెడ్డిపై వేణుగోపాల్‌ కక్ష పెంచుకున్నాడని అన్నారు.

నగరంలోని నోవాటెల్ హోటల్ దగ్గర కారులో ఉన్న కృష్ణారెడ్డి, గంగాధర్‌‌, నాగవల్లిపై వేణుగోపాల్ రెడ్డి సోమవారం హత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. అందరూ కారులో కూర్చుని మాట్లాడుకుంటుండగా వేణుగోపాల్ బయటకు వచ్చి, తాళాలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.

You might also like