FbTelugu

ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం

సిద్దిపేట: ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన జిల్లాలోని మూలుగు దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగివున్న లారీనీ వేగంగా వచ్చిన

డీసీఎం ప్రమాదవ శాత్తూ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు కర్నూలు జిల్లా కూచునూరుకు చెందిన అయ్యస్వామిగా గుర్తించారు.

You might also like