FbTelugu

గొర్రెల లోడ్‌తో వెళుతున్న డీసీఎం బోల్తా

* 70 గొర్రెలు మృతి
మహబూబాబాద్ : గొర్రెల లోడుతో వెళుతున్న ఓ డీసీఎం బోల్తాపడి 70 గొర్రెలు మృతి చెందిన ఘటన జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాండ్లసంకీస సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు నుంచి మధిరకు గొర్రెలను డీసీఎం లారీలో తరలిస్తుండగా..

స్థానిక పెరుమాండ్లసంకీస సమీపంలో అదుపుతప్పి డీసీఎం బోల్తాపడింది. ఈ ఘటనలో 70 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. డీసీఎం లోని ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.