FbTelugu

కోళ్ల లోడుతో వెళుతున్న డీసీఎం బోల్తా

గద్వాల: కోళ్ల లోడుతో వెళుతున్న ఓ డీసీఎం బోల్తాపడి డ్రైవర్, క్లీనర్ లకు తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని మానవపాడు మండలం, బోరవెల్లి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కోళ్లను తరలిస్తున్న ఓ డీసిఎం ప్రమాదవశాత్తు బోల్తాపడింది.

ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలైనాయి. ఇదిలా ఉండగా.. బోల్తా పడిన డీసీఎం నుంచి కోళ్లను స్థానికులు ఎత్తుకెళ్లారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.