FbTelugu

దావూద్ ఇల్లు వదిలేశారు…కంగన ది కూల్చేశారు..

ముంబై: మహారాష్ట్ర లో కూటమి ప్రభుత్వం, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇంటిని కూల్చివేయకుండా నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేయడం సరికాదని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ పై యుద్ధం చేయాల్సింది పోయి, కంగనా రనౌత్ పై యుద్దం చేస్తోందని ఆయన విమర్శించారు. ఆమె చేసే పోరాటంలో సగం శక్తిని కరోనా పై వాడితే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దావూద్ ఇబ్రహీం ఇల్లు కూల్చలేదు కాని కంగనా కార్యాలయాన్ని నేలమట్టం చేశారని విమర్శించారు. ఒక హీరోయిన్ చేసే ఆరోపణలపై అనవసర బేషజాలకు వెళ్లవద్దని దేవేంద్ర ప్రభుత్వాన్ని సూచించారు.

You might also like