FbTelugu

ఆస్ట్రేలియాకు జట్టుకు భారీ షాక్‌

* గాయంతో డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం

సిడ్ని: ఆస్ట్రేలియా, ఇండియాలకు జరుగుతున్న వన్డే మ్యాచుల్లో మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింగి. ఈ వన్డేల్లో మంచి ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నర్ కు గాయం కావడంతో టీమిండియాతో ఆస్ట్రేలియా మిగిలిన వన్డేతో పాటూ మూడు టీ20లకు వార్నర్‌ దూరమయ్యాడు. వార్నర్‌ స్థానంలో డీ ఆర్సీ షార్ట్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. గడిచిన రెండు వన్డే మ్యాచ్ లలోనూ వార్నర్ మంచి స్కోరే చేశారు.

కానీ అతని తొడపై భాగంలో గాయం కావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. వార్నర్ కోలుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.