FbTelugu

ప్రియుని మోజులో తండ్రికి నిప్పంటించిన కూతురు

లక్నో: ప్రియుని మోజులో ఓ కూతురు కన్న తండ్రికే నిప్పంటించడంతో మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లా, వాజిర్‌గంజ్‌ ఏరియా, హత్రా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్రా గామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకునితో ప్రేమవ్యవహారం నడిపిస్తోంది.

ఈ విషయం తండ్రికి తెలియడంతో కూతుర్ని మందలించాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన కూతురు ప్రియుని మోజులో కన్న తండ్రికే పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన తండ్రి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనకు సదరు కూతురికి కుటుంబ సభ్యులు సహకరించడం గమనార్హం. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.