FbTelugu

తండ్రి ద్వితీయ వివాహంపై కుమార్తె నిలదీయవచ్చు

ముంబయి: తండ్రి ద్వితీయ వివాహం చెల్లుబాటుపై ప్రశ్నించే అధికారం కుమార్తెకు ఉంటుందని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. వివాహం అనేది ఇద్దరి మధ్య జరుగుతుందని, వారిలో ఎవరైనా కోర్టులో చెల్లుబాటు గురించి ప్రశ్నించే అధికారం ఉంటుందని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది.

తన తల్లి (66) మరణించిన తరువాత తండ్రి మరో వివాహం చేసుకోవడంపై కుమార్తెను హైకోర్టులో పిటీషన్ వేసింది. 2003లో తల్లి మరణించిన తరువాత తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు. 2016లో తండ్రి మరణించాక సవతి తల్లి వివాహం చేసుకున్నట్లు తెలపడంతో కుమార్తె కంగుతిన్నది. మొదటి భర్తతో విడాకులు తీసుకోకుండానే తన తండ్రి ఆస్తులన్నీ అనుభవిస్తుండడాన్ని కుమార్తె ప్రశ్నించింది. విడాకులు తీసుకోకుండా తన తండ్రిని పెళ్లి చేసుకుంటే ఎలా చెల్లుబాటు అవుతుందంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, సవతి తల్లికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై కుమార్తె హైకోర్టును ఆశ్రయించగా, అనుకూలంగా తీర్పు వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.