FbTelugu

డేటింగ్ యాప్ తో చీటింగ్

హైదరాబాద్: మనుషుల బలహీనతను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే ముఠాలు ఎప్పటికప్పుడు రూటు మార్చుకుంటూ తిరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో డేటింగ్ యాప్ లకు యమ డిమాండ్ పెరిగింది.

డేటింగ్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఒక ముఠా రూ.13.8 లక్షలు కాజేసింది. సహజీవనానికి అమ్మాయిలను పంపిస్తామంటూ ఈ డబ్బులు వసూలుచేశారు. ఎంతకీ అమ్మాయిలను పంపించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డేటింగ్ యాప్ మోసాలపై సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ నిందితుడు సంతూదాస్ నుంచి 31 సెల్ ఫోన్లు, 12 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సంతూదాస్ 35 టెలీకాలర్ సెంటర్లను ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. సహజీవనం కోసం డేటింగ్ యాప్ లను సంప్రదించవద్దని సజ్జనార్ సూచించారు. ఇలా ఎవరైనా మీ వద్దకు వస్తే పోలీసులకు ఫోన్ చేసి తెలియచేయాలని ఆయన కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.