FbTelugu

డేటింగ్ యాప్ హీరోయిన్ బొమ్మ…

హైదరాబాద్: సోషల్ మీడియా, డేటింగ్ యాప్ లలో పోకిరీలు, సైబర్ నేరగాళ్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ఎన్ని కేసులు పెడుతున్నా, ఎంత మందిని అరెస్టు చేస్తున్నా వారిలో మార్పు రావడం లేదు.

గీతాంజలి సుమారు 32 సినిమాల్లో నటించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాత్రలు పోషించారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట చిత్రంలో నటించిన గీతాంజలికి మంచి గుర్తింపు తెచ్చింది. గీతాంజలికి తెలియకుండా ఒక డేటింగ్ యాప్ లో ఆమె ఫొటోలను పెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఈ విషయం ఒక స్నేహితుడు చెప్పేవరకు ఆమెకు తెలియదంటే ఎంత దారుణమో ఊహించండి. హాట్ లైవ్ డేటింగ్ యాప్ లో నా ఫోటో ఉన్నట్లు నాకు కాల్స్ వచ్చాయి. ఇలా ఫొటోలు పెట్టకుని డబ్బులు సంపాదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నేను సినీరంగంలో ఎదుగుతూ ఉండడాన్ని చూసి కొందరు ఓర్వలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.