FbTelugu

45 లక్షల మంది ప్రయాణీకు డేటా లీక్

న్యూఢిల్లీ: డేటా చోరీ జరుగుతున్నదని, సైబర్ దాడులు జరుగుతున్నాయని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా ఏయిర్ ఇండియా మాత్రం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించింది. ఏయిర్ ఇండియాకు చెందిన సిటా పిఎస్ఎస్ ప్యాసెంజర్ సర్వీస్ సిస్టమ్ పై సైబర్ దాడి జరిగింది.

సుమారు 45 లక్షల మంది ప్రయాణీకుల పర్సనల్ డేటా సమాచారం సైబర్ నేరగాళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుల పాస్ పోర్టు వివరాలు, ఇళ్లు, కార్యాలయం అడ్రస్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీ చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రయాణీకుల సమాచారం దొంగిలించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించామని, పూర్తి వివరాలు మార్చి 25, ఏప్రిల్ 5 మధ్యన తెలిశాయని ఏయిర్ ఇండియా ప్రకటించింది. ఈ విషయం నిరూపితం కాగానే వెంటనే చర్యలు చేపట్టి సర్వీర్ పాస్ వర్డ్ లను మార్చామని పేర్కొంది. ప్రయాణీకులు కూడా క్రిడిట్ కార్డుల పిన్, లాగిన్ వివరాలు, మనీ పేమెంట్ కార్డుల పిన్ ను మార్చుకోవాలని సూచించింది. ఆగస్టు 26, 2011, ఫిబ్రవరి 20, 2021 మధ్య ప్రయాణించినవారు, టికెట్ బుక్ చేసుకున్నవారి సమాచారం మొత్తం తస్కరించారు. అయితే సైబర్ దాడికి ఎవరు పాల్పడ్డారనేది ఏయిర్ ఇండియా వెల్లడించలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.