FbTelugu

ఆలుగడ్డ శ్రీనివాస్ పై దాసోజు శ్రావణ్ ఆగ్రహం

హైదరాబాద్: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇక నుంచి తన పేరు తోక ముడిచిన తారక రామారావుగా మార్చుకోవాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ సూచించారు. లక్ష ఉద్యోగాల కల్పనపై చర్చకు సిద్ధమని ప్రకటించి కేటీఆర్ తోకముడిచారని ఎద్దేవా చేశారు.
ఇవాళ దాసోజు శ్రావణ్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆలుగడ్డ శ్రీనివాస్ యాదవ్ తో కేటీఆర్ కు ఏమాత్రం తగదని హితవు పలికారు. ఆలుగడ్డలు అమ్ముకుని రౌడీయిజం చేసే శ్రీనివాస్ యాదవ్ ను టీఆర్ఎస్ లోకి తీసుకువచ్చిన తెలంగాణ కోసం పోరడిన వారి ఆత్మలకు శాంతి లేకుండా చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య గురించి నేను మాట్లాడితే. గొట్టంగాడినా అని ఆయన విరుచుకుపడ్డారు. కనీసం బుద్దిలేని సన్నాసి ఆలుగడ్డ శ్రీనివాస్ అని అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయ బిక్షగాడు శ్రీనివాస్ అని శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం విడిపోయే ముందు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే నాటికి 1.30 లక్షల ఉధ్యోగులు భర్తీ అయ్యాయని ఆయన వివరించారు. కాంగ్రెస్ హయాంలో పదివేల ఉద్యోగాలు కల్పించారని కేటీఆర్ చెప్పడం శుద్ధ అబద్ధమన్నారు. నేను చెప్పేది తప్పని కేటీఆర్ గన్ పార్క్ కు వచ్చి నిరూపిస్తే అక్కడే గొంతు కోసుకుని ప్రాణం తీసుకుంటానని శ్రావణ్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.