FbTelugu

ఆస్తి కోసం దాసరి కుమారుల తగాదా

హైద‌రాబాద్‌: ‌దివంగత దర్శకులు దాసరి నారాయణ రావు కుమారుల మధ్య ఆస్తి తగాదా మొదలైంది. ఆస్తి పత్రాల కోసం సోదరుడు ప్రభు ఇంట్లోకి అరుణ్ చొరబడ్డాడు.
ఈ నెల 24వ తేదీ రాత్రి తన ఇంటి గేటు దూకి వచ్చిన అరుణ, ఇంట్లో బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని ప్రభు ఆరోపించాడు. మద్యం సేవించి వచ్చిన అరుణ్ తమ ఇంట్లో వారిపై దాడి చేశాడన్నారు. తండ్రి నారాయణరావు ఇచ్చిన వీలునామా ప్రకారం ఆ ఇల్లు తన కుమార్తెకు చెందుతుందన్నారు.

ఆస్తికోసం తమ ఇంట్లోకి చొరబడి దాడి చేసిన సోదరుడు అరుణ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై మోహన్ బాబు, మురళీ మోహన్, నిర్మాత సి.కళ్యాణ్ స్పందించాలని ప్రభు కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.