FbTelugu

చరిత్రలో చీకటి రోజు: చంద్రబాబు

అమరావతి: ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజు అని, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం చారిత్రక తప్పిదమని తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు విమర్శించారు. మూడు రాజధానుల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం, ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు.

కరోనా వల్ల తిండి కూడా లేకుండా ఎంతోమంది అలమటిస్తున్నారని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య చిచ్చురేపే నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్.జగన్ ది పైశాచిక ఆనందం అని అన్నారు. ప్రపంచంలోనూ, దేశంలోనూ ఎక్కడా మూడు రాజధానులు లేవు.. అని చంద్రబాబు తెలిపారు.

చిన్న రాష్ట్రం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సబబు కాదు అందుకే నేను అమరావతి కి మద్దతు పలుకుతున్నాను అన్న జగన్ ఎందుకు మడమ తిప్పారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

You might also like