FbTelugu

మాయలేడీ మోసాలు… కోట్లలో లూటీ!

విజయవాడ: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి వ్యాపారులను టార్గెట్ చేసి లక్షల రూపాయలు లూటీ చేస్తున్నది. ఒక ప్రముఖ న్యాయవాది పేరుతో దందాలు సాగిస్తున్నది.

వలపు మహిళ వలలో చిక్కిన బాధితులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. నగరానికి చెందిన మున్సిపల్ కార్పొరేటర్, హోటల్ యజమాని, బడా వ్యాపారులు సహా పదుల సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఇప్పటికే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నా వలపు వలతో మోసాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నది. తాము మోసం పోయామని గ్రహించిన బాధితులు గుట్టు చప్పుడు కాకుండా పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రముఖ న్యాయవాది పేరును అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నదని తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్టర్, కన్సల్టెంట్ అంటూ పరిచయాలు పెంచుకుంటున్నదని వివరించారు. వివాదాల్లో ఉన్న ఆస్తులు విడిపించుకుందాం అంటూ అప్పులు తీసుకుంటున్నదని తెలిపారు. డబ్బులు తీసుకున్నాక ముఖం చాటేస్తున్నది బాధితులు గొల్లుమన్నారు. గాంధీనగర్ లో ఒక ప్రముఖుడు రూ.50 లక్షలు, బెంజి సర్కిర్ లో మరో వ్యాపారి రూ.1 కోటి, సూర్యారావు పేటలో మరొకరు రూ.25 లక్షలు కోల్పోయినట్లు తెలిపారు. పోలీసులను ఆశ్రయించినప్పటికీ బాధితులకు ప్రయోజనం దక్కలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.