FbTelugu

దళిత రాష్ట్రపతిని ఆహ్వానించాల్సింది: మాయావతి

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజా కార్యక్రమానికి యూపీ వాసి, దళితుడు రామ్ నాథ్ కోవింద్ ను ఆహ్వానించాల్సి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత సాధువులు పాలుపంచుకునేందుకు ఆసక్తి కనబర్చినా వారిని పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓట్ల కోసం పరశురాముడి విగ్రహం ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సమాజ్ వాది పార్టీపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరశురాముడి విగ్రహం గురించి ఇప్పుడు మాట్లాడే కంటే అధికారంలో ఉన్నప్పుడు నిర్మించాల్సిందని ఆమె అన్నారు. అయోధ్యలో భారీ పరశురాముడి విగ్రహం ఏర్పాటు చేస్తామని మాయావతి ప్రకటించారు.

You might also like