FbTelugu

హుజూరాబాద్ కోసమే దళిత నాటకం: బిజెపి నేత వివేక్

హైదరాబాద్: ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సిఎం పదవిని ఇస్తేనే దళితులు కెసిఆర్ ను నమ్ముతారని బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి అన్నారు.

ఎన్నికల సమయంలోనే దళితులు సిఎం కెసిఆర్ కు గుర్తుకు వస్తారని, ఏడు సంవత్సరాల క్రితం పెట్టిన సమావేశం తీర్మానాలు ఎక్కడ పోయాయని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు 45వేలు ఉన్నాయని, ఆ ఓట్ల కోసమే ఈ నాటకం మొదలైందన్నారు. ఉప ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు లను ప్రగతి భవన్ పిలిపించుకున్నాడన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కుమారుడు కెటిఆర్ ను అక్రమ దారిలో సిఎం చేయాలని అనుకుంటున్నాడని వివేక్ ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.