FbTelugu

దళపతి విజయ్ రెమ్యునేషన్ అంతా!?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రెమ్యునరేషన్ వార్త సినివర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్, నిర్మాత దిల్ రాజ్ అలియాస్ వెంకటరమణా రెడ్డి, దర్శకుడు పైడిపల్లి వంశీ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్నది.

ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ హింది భాషల్లో చిత్రీకరిస్తున్నారు. అన్ని భాషల ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రానికి దిల్ రాజు రూ.170 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ఈ మొత్తంలో హీరో విజయ్ కు రూ.90 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయన ఒక్కో చిత్రానికి రూ.80 కోట్లు తీసుకోగా, అంతకు మించిన రెమ్యునరేషన్ దిల్ రాజు ఆఫర్ చేశాడంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.