FbTelugu

సికింద్రాబాద్ ఓటర్లకు ఉచితంగా సిలిండర్లు

హైదరాబాద్: కరోనా పాజిటివ్ సోకిన వారిలో కొందరు సరైన సమయంలో ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ బెడ్స్ లభించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
వీరిని ప్రాణగండం నుంచి రక్షించేందుకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉచిత ఆక్సీజన్ సిలిండర్ల సౌకర్యాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కుమారుడు రామేశ్వర్ గౌడ్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ ఈ సేవ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా అవసరం ఉన్నవారు 99591 53855 నెంబర్ కు ఫోన్ చేస్తే ఆక్సిజన్ సిలిండర్ పంపిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

You might also like