FbTelugu

సిలిండర్లు పేలి ఇద్దరు మృతి

చిత్తూరు: రెండు కంప్రెషర్ సిలిండర్లు పేలిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

కుప్పం మండలంలోని తంబిగానిపల్లెలో ఓ వెల్డింగ్ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఇద్దరు చనిపోయారు. షాపు యజమాని గౌష్ బాషా, తన వద్ద పనిచేసే ఇద్దరు యువకులు అఫ్సర్ (19), ఎజాద్ (17), మంజునాథ్‌లతో కలిసి పనిచేస్తున్నారు.

క్రేన్‌లో ఉండే రెండు కంప్రెషర్ సిలిండర్లపై వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. సిలిండర్లపై పడడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో అవి పేలిపోయాయి. ఈ పేలుడులో అఫ్సర్, ఎజాద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గౌష్ బాషా, మంజునాథ్‌తోపాటు క్రేన్ డ్రైవర్ రఫీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

You might also like