FbTelugu

సిలిండర్ తగాదా… ఒక మహిళ మృతి

కువైట్‌: గ్యాస్ సిలిండర్ విషయమై జరిగిన గొడవలో భారత వ్యక్తి ఒక మహిళను దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

కువైట్‌లోని అల్ రుమైతియా‌లో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న ఒక భారతీయ కుటుంబంతో సదరు యువకుడు కలిసి ఉంటున్నాడు. ఎల్పీజీ సిలిండర్ కోసం ఇద్దరి మధ్య మాటామటా పెరిగి పొడుచుకునే స్థాయి వరకు వెళ్లింది. దీంతో ఘర్షణతో కోపోద్రిక్తుడైన యువకుడు మహిళను పలుమార్లు కత్తితో పొడిచాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రక్తపు మడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.