FbTelugu

సైక్లింగ్ బ్యాలెట్… గుండె దడ దడ?

హైదరాబాద్: సైక్లింగ్ బ్యాలెట్ అనే పదం గ్రేటర్ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం విజయవంతం అయితే ఫలితాలు తారుమారు అవుతాయని జంకుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లో చివరి సారిగా 2002లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహించారు. ఇక ఆ తరువాతి నుంచి ఈవీఎంలనే ఉపయోగిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెటర్ పేపర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెద్ద ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఒక పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు లేదా బలమైన పార్టీకి చెందిన కార్యకర్త పోలింగ్ కేంద్రం సమీపంలో కూర్చుంటాడు. ఈ బూత్ పరిధిలోని ఓటర్లను ఆయన వద్దకు పంపిస్తుంటారు. అలా వచ్చిన వారికి తమ వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్ డమ్మీని మడతపెట్టి ఇస్తాడు.

దీనిపై అప్పటికే తమ అభ్యర్థి ఎదురుగా ముద్ర వేసి ఉంటుంది. దాన్ని తీసుకున్న ఓటరు నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి గుట్టుగా ఓటు వేసి వస్తాడు. బయట ఇచ్చిన బ్యాలెట్ ను లోపల బాక్స్ లో వేసి, అధికారులు ఇచ్చిన బ్యాలెట్ ను తీసుకువచ్చి మళ్లీ నాయకుడికి అందచేస్తారు. ఆయన దాన్ని తీసుకుని డబ్బులు చెల్లిస్తాడు. ఈ విధానం పాత రోజుల్లో జోరుగా నడిచేది. దీన్నే సైక్లింగ్ బ్యాలెట్ అంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమకు బలమున్న బూతులలో ఈ విధానం అమలు చేసే ప్రమాదముందని ప్రత్యర్థులు భయపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.