FbTelugu

డ్రైవర్ తాగితే ఇక అంతే సంగతులు

హైదరాబాద్: ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులు లేదా డ్రైవర్ పై కేసులు పెడుతున్నారు. వాహనం జప్తు చేసి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. కాని సైబరాబాద్ పోలీసులు మరో కొత్త నిబంధనను బయటకు తెచ్చారు.

ఇక నుంచి తాగిన వ్యక్తి వాహనం నడిపితే అతనితో పాటు అందులో ప్రయాణించేవారిపై కేసులు పెట్టనున్నట్లు సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి ఆ వాహనంలో ప్రయాణించడంతో చట్టరీత్యా నేరమని వెల్లడించారు. మోటర్ వాహనాల చట్టంలోని 188 సెక్షన్ ను ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సెక్షన్ కింద మద్యం సేవించి వాహనం నడపడం కుదరదని ఆయన అన్నారు. ఇక నుంచి డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణించేవారు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.