FbTelugu

మందుబాబులపై ఉక్కుపాదం: సీపీ సజ్జనార్

హైదరబాద్: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై మందుబాబులు రోడ్డు ఎక్కకుండా చేస్తామని అన్నారు. మూడు నెలలపాటు పక్కా ప్రణాళికతో డీడీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

గత వారం రోజులుగా నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో దాదాపు 3,710 కేసులు నమోదు చేశామని వివరించారు. ప్రస్తుతం మందుతాగిన తర్వాత చాలా మంది డ్రైవర్లను పెట్టుకుని వెళ్తున్నారన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 65శాతం ద్విచక్ర వాహనదారులేనన్నారు. వారం రోజుల్లో జీరో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు ఉంటాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.