FbTelugu

మాణప్పురం గోల్డ్ కే టోకరా!

హైదరాబాద్: సైబర్ కేటుగాళ్లు ఉన్నారు… జాగ్రత్త అని ఎం చెబుతున్నా జనాలకు అర్థం కావడం లేదు. మనషుల బలహీనతను ఆసరా చేసుకుని ఏదో ఒక రూపంలో లక్షలు కొల్లగొడుతున్నారు.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మాణప్పురం గోల్డ్ సంస్థ ను లూటీ చేశారు. మణప్పురం గోల్డ్ సంస్థకు రూ.30 లక్షలు టోకరా వేశారు. సంస్థ ఉన్నతాధికారినంటూ హిమాయత్ నగర్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి లాగిన్ ఐడి, పాస్ వర్డ్ తీసుకున్నాడు. అలా ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించిన కేటుగాళ్ళు వారి ఐడిల నుండి లాగిన్ అయి రూ.15 లక్షల చొప్పున కాజేసినట్లు సంస్థ ఉన్నతోద్యోగులు గుర్తించారు. సైబర్ కేటుగాళ్లపై మాణప్పురం సంస్థ సైబర్ క్రైమ్స్ పోలీసుకు ఫిర్యాదు చేసింది.
రూ.53 లక్షలు లూటీ…

సైబర్ నేరగాళ్లు మసాబ్ ట్యాంక్ కు చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్నాలజీస్ సంస్థ ఎండి ని తప్పుదోవ పట్టించి రూ.53 లక్షలు కొట్టేశారు. మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థ తో నిమ్రా యజమాని ఖాదర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తం ట్రాన్స్ ఫర్ చేశారు. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్ ని ట్రాప్ చేశారు. సంస్థ యజమానులం అని చెప్పి డబ్బును లండన్ లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈ మెయిల్ పంపించారు. నిజమే అనుకుని ఖాదర్ ఓపెన్ చేసి రూ.53.27 లక్షలు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తరువాత సంస్థ యజమానులకు సంప్రదించడంతో మోసం బయటపడింది. బాధితుడు ఖాదర్ లబోదిబోమంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.