FbTelugu

రూ.84 లక్షలు లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు..

హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎవరికో ఒకరికి వల వేసి లక్షలు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు రూ.84 లక్షలు లూటీ చేశారు. బాధితులు లబోదిబోమంటూ సైబర్ క్రైమ్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు ఇస్తామని నగరంలో నాగేశ్వర్ రావు అనే వ్యక్తి నుండి కేటుగాళ్లు రూ.43 లక్షలు కాజేశారు. తాను మోసపోయానని గమనించిన వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్ బుక్ స్నేహం పేరుతో ప్రేమలో పడిన ఇద్దరు డాక్టర్లు కూడా లక్షలు పోగొట్టుకున్నారు. విలువైన గిఫ్ట్ పంపిస్తామని నమ్మించిన కేటుగాళ్ళు.. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల మంటూ ఫోన్ కాల్ చేసి బురిడీ కొట్టించారు. కస్టమ్స్ ఛార్జీలు, ఇతర చార్జీల పేరుతో డాక్టర్ రూ.24 లక్షల ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. ఏమి రాకపోవడంతో మోసం జరిగిందని గ్రహించిన డాక్టర్ నందకుమార్ సైబర్ క్రైమ్స్ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ రెండు కాకుండా మృతి చెందిన ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.13 లక్షలు మాయం అయ్యాయి. గత నెలలో తన భర్త కరోనా పాజిటివ్ సోకి మరణించాడని.. ఆయన ఖాతా నుండి తమకు తెలియకుండా రూ.13 లక్షల మాయమయ్యాయి. మలక్ పేట మూసరాంబాగ్ కు చెందిన మీనాక్షీ అనే మహిళ సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించవచ్చు అని మొబైల్ కి మెసేజ్ రావడంతో ఆ నెంబర్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. పేపర్ ప్లేట్ తయారీ మెషిన్ తక్కువ ధరకు ఇస్తామని నమ్మించి ఆన్ లైన్ ద్వారా రూ.4 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. బాధితుడు రోదిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.