FbTelugu

సిమ్ బ్లాక్ అవుతోందంటూ.. రూ.2 లక్షలు స్వాహా

హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు రోజుకో కొత్తపంతాను అవలంబిస్తున్నారు. సిమ్ బ్లాక్ అవుతోందంటూ పోన్ కాల్ వచ్చి, వారు పంపిన ఓ మెసేజ్ లింకును ఓపెన్ చేయగా ఓ మహిళ ఖాతానుంచి ఏకంగా రూ.2 లక్షలు మాయమైన ఘటన స్థానిక వనస్థలిపురంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఓ ఉపాధ్యాయురాలికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ సిమ్ బ్లాక్ అవుతోందని తెలిపారు. తాము పంపిన లింక్ ను ఓపెన్ చేయాలని సూచించారు. వారు చెప్పినట్టే ఆ ఉపాధ్యాయురాలు చేసింది. దీంతో ఫోన్ లో ఉన్న సమాచారంతో వారు ఆమె ఖాతాలోని రెండు లక్షలను కాజేశారు. మోసపోయానని గుర్తించిన ఆ మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like