FbTelugu

రూ.25 లక్షల లాటరీ అంటూ.. రూ.3 లక్షలకు బురిడీ

కామారెడ్డి: రూ.25 లక్షల లాటరీ అంటూ.. సైబర్ నేరగాళ్లు ఓ మహిళకు గాలం వేసి సుమారు రూ.3 లక్షలకు బురిడీ కొట్టించిన ఘటన రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మంగలపల్లి లక్ష్మి అనే యువతికి గత నెలలో మీరు రూ.25 లక్షలు లాటరీలో గెలుచుకున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి తెలిపారు.

మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి మీరు గెలుచుకున్న డబ్బులు రావాలంటే జీఎస్టీ మీరే చెల్లించాలని తెలిపాడు. ఓ ఖాతా నంబరు పంపి అందులో రూ.12,300 జమ చేస్తే సరిపోతుందని తెలిపారు. నిజమేనని నమ్మిన లక్ష్మి వారు చెప్పినంత డబ్బును ఖాతాలో వేసింది. ఇదిగో వచ్చె అదిగో వచ్చె అంటూ అనేక ట్యాక్స్ ల పేర్లు చెప్తూ అనేక సార్లు అనేక ఖాతాల్లో రూ.2 లక్షల 60 వేలు వేయించుకున్నారు.. అయినా ప్రైజ్ మనీ రాలేదు. ఇంకా ట్యాక్స్ లు కట్టాలనడంతో గట్టిగా అడిగింది లక్ష్మి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని తెలుసుకొని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.