FbTelugu

సైబర్ చీటర్లు నిండా ముంచుతున్నారు…

హైదరాబాద్: లాటరీ పేరుతో… బ్యాంకు అధికారులం అంటూ… ఆన్ లైన్ పేరుతో ఇలా పలురకాలుగా ప్రజలను సైబర్ చీటర్లు మోసం చేశారు. మోసాలు చేస్తున్నారు జాగ్రత్త అని పోలీసులు ఎంత మొత్తుకున్నా ప్రజలు మాత్రం వీరిలో మాయలో పడి లక్షలు కోల్పోతున్నారు.
మెహదీపట్నం కు చెందిన ఓ మహిళకు లాటరీ ద్వారా కారు గెలుచుకున్నారని సైబర్ కేటుగాళ్ళు కాల్ చేశారు. నిజమేనని నమ్మిన ఆమె వారు చెప్పినట్లుగా చేసింది. ఆ కారు డెలివరీ చేయాలి అంటే ప్రాసెసింగ్ ఆన్ లైన్ ప్లీజ్ పేర్లతో రూ.5 లక్షలు ఆన్ లైన్ ద్వారా కాజేశారు. ఎంతకీ కారు రాకపోవడంతో మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కెవైసి ఓటిపి పేరుతో 30 లక్షల మోసం…
బ్యాంక్ అధికారులమంటూ.. ఒక ఖాతాదారుడిని మోసం చేస్తున్న ముఠాను జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్ జామ్ తార జిల్లా కు చెందిన ఆరు మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆరు మంది ముఠాపై హైదరాబాద్ లో సైతం కేసులు నమోదు కావడంతో తెలంగాణ పోలీసులు రాంచి జైలు నుండి పీటీ వారెంట్ పై తీసుకువచ్చారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు.
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.20 కోట్ల మోసం…
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను చత్తీస్ గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పలు కేసుల్లో ఉన్న వీరిని పిటీ వారెంట్ పై ఉండడంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.