FbTelugu

సైబర్ చీటర్ స్వాతి అరెస్టు

హైదరాబాద్: పెళ్లి సంబంధాల వెబ్ సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న సైబర్ చీటర్ ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే దుర్బద్దితో పలువురిని మోసం చేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన స్వాతి ఎంబీఏ చదివి, ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకునే పెళ్లి సంబంధాల వెబ్ సైట్లను ఎంపిక చేసుకున్నది. అమెరికాలో పెద్ద కంపెనీలో పనిచేస్తున్న తెలుగు అమ్మాయినంటూ ప్రొఫైల్ అప్ లోడ్ చేసింది.

వాటికి తన ఫొటో కాకుండా అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టదేది. ప్రొఫైల్ చూసి ఎవరైనా ఫోన్ చేస్తే యూఎస్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించేది. ఇందుకోసం వర్చువల్ ఫోన్ నెంబర్లను స్వాతి వాడేది. పరిచయం పెరిగిన తరువాత ఇండియాకు వస్తున్నాననంటూ చెప్పి, కొంత డబ్బులు సర్దుబాటు చేయాలని కోరేది. తనకు డబ్బులు అందగానే ఇక ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తేది కాదు. ఇదే మాదిరి రూ.5 లక్షలు నష్టపోయిన ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో స్వాతి గుట్టు రట్టయింది. ఫిర్యాదు ప్రకారం విచారణ చేసిన పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.