FbTelugu

తక్కువ ధరకే బైకులంటూ.. సైబర్ మోసం

హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతున్నారు. ఆశావహులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓఎల్ఎక్స్ లో తక్కువ ధరకు బైక్ విక్రయం పేరిట ఇద్దరు వ్యక్తులను బురిగీ కొట్టించి రూ.1.04 లక్షలు కాజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీష్, జమీల్ అనే ఇద్దరు వ్యక్తులను ఓఎల్ఎక్స్ లో అతి తక్కువ ధరకు బైక్ ను అమ్ముతామంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. ఇలా నమ్మించి వారినుంచి ఏకంగా ఒక లక్షా నాలుగు వేల రూపాయలను నేరగాళ్ల ఖాతాలో వేయించుకున్నారు. చివరకు మొసపోయామని తెలిసి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like