FbTelugu

వైసీపీ నేత ఇంట్లో కస్టమ్స్ సోదాలు

ప్రకాశం: ఒంగోలు పట్టణంలో వైసీపీకి చెందిన ఒక ప్రముఖ బంగారు నగల వ్యాపారి ఇంట్లో కస్టమ్స్ అధికారులు గురువారం తెల్లవారు జాము వరకు సోదాలు నిర్వహించారు.
బుధవారం ఉదయం తమిళనాడులోని ఎలావూర్ చెక్ పోస్టు వద్ద రూ.4 కోట్ల నగదుతో పాటు పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. పట్టుబడిన వాహనం పై ఏపీ గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చెన్నైలోని కస్టమ్స్ అధికారులకు తెలియచేశారు.

అయితే ఈ ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పట్టుబడిన వాహనానికి తనకు సంబంధం లేదని ఖండించారు. కారుపై జిరాక్స్ స్టిక్కర్లు వాడారని ఆయన అన్నారు. అయితే ప్రతి ఎమ్మెల్యేకు అసెంబ్లీ అధికారులు ఐదు స్టిక్కర్లు ఇస్తున్నారు. ఈ స్టిక్కర్లను తమ ముఖ్య అనుచరులు, స్నేహితుల వాహనాలకు అంటిస్తున్నారు. అసెంబ్లీ అధికారులు అడిగితే మాకు నచ్చిన వాహనాలకు అంటించుకుంటామనే విధంగా సమాధానం చెబుతున్నారు.
ఇలా కేసులు అయిన సందర్భంలో తమకు సంబంధం లేదని, జిరాక్స్ కాపీ అని, దొంగిలించారనే సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారు.

You might also like