FbTelugu

బాబు రోడ్ షో లో కరెంట్ కట్

బాబు రోడ్ షో కరెంట్ కట్

విశాఖపట్నం: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫలితంగా వీధిలైట్లు వెలగకపోవడంతో రోడ్లన్నీ చిమ్మచీకటిగా మారాయి.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాత్రి ఎన్ఏడీ కొత్త రోడ్డు లో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ సాయంత్రం పెందుర్తి నుంచి తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అక్కడి నుంచి చినమూషివాడ, వేపగుంట, గోపాలపట్నం, ఎన్ఏడీ, మర్రిపాలెం, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్య పాలెం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తారు. తిరిగి శనివారం ఉదయం నుంచి రాత్ర వరకు విశాఖలో రోడ్ షో లో ప్రచారం చేస్తారు. ఆయన వెంట ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు, విశాఖ జిల్లా టీడీపీ నాయకులు పాల్గొంటారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.