FbTelugu

ముళ్ల చెట్ల కింద డబ్బులే డబ్బులు…

బెంగళూరు: దొంగలు దోచుకున్న సొమ్మును దాచుకునే సౌకర్యం లేకపోవడంతో భద్రంగా ముళ్ల పొదల కింద దాచారు. అవి కాస్త పోలీసు జాగిలాల వాసనకు చిక్కడంతో చోరీ డబ్బుల  గుట్టు రట్టయింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్రదుర్గ జిల్లా చల్లకెరె తాలూకాలోని బుక్లోరహల్లి గ్రామంలో ఉన్న ముళ్ల పొదల్లో రూ. 36 లక్షలు విలువచేసే నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఇటీవల బుక్లోరహల్లి గ్రామానికి సమీపంలో ఉన్న దిలీప్ బిల్డ్ కాన్ లిమిటెడ్‌ ఆఫీస్ లో చోరీ జరిగింది. ఈ చోరీలో దొంగలు రూ.36 లక్షల నగదు ఎత్తుకెళ్ళారు. దీనిపై కంపెనీ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

జాగిలాలతో తనిఖీ చేయించగా ముళ్ల పొదల వద్దకు తీసుకువెళ్లి ఆగిపోయాయి. పోలీసులు వెదకగా డబ్బుల కట్టలు బయటపడ్డాయి. మొత్తాన్ని లెక్కించగా సుమారు రూ.36 లక్షల వరకు ఉన్నాయి. డబ్బులను స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.