FbTelugu

ఆ జిల్లాలో ప్రతి ఆదివారం కర్ఫ్యూ

తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఆదివారం కర్ఫ్యూ విధించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఒక్క రోజే ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో జిల్లాలో కూడా అత్యధికంగా 1,051 కేసులు నమోదు అయినాయి. జిల్లాలో కాంటాక్టు కేసులు ఎక్కువ కావడంతో కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కర్ఫ్యూ 24 గంటల పాటూ అమలు కానుంది.

You might also like