FbTelugu

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు పోటీగా క్యూర్ ఫిట్

ముంబయి: దేశంలో గత దశాబ్ధకాలం నుంచి ఈ కామర్స్ కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఊహించనంత స్థాయికి చేరుకున్నాయి. ఈ రంగంపై టాటా సన్స్ సంస్థ రెండేళ్ల నుంచి దృష్టి పెట్టింది.
ఈ కామర్స్ బలోపేతంలో భాగంగా క్యూర్ ఫిట్ లో 75 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది.

అయితే ఎంత వాటా కొనుగోలు చేసింది మాత్రం వెల్లడించలేదు. ఈ సంస్థ వ్యవస్థాపకులు ముకేశ్ బన్సాల్ టాటా డిజిటల్ లో త్వరలో చేరితే, ఆయనకు ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల కొరతను ఎదుర్కొంటున్న సంస్థలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ కామర్స్ విభాగాన్ని బలోపేతం చేయడంపై టాటా సన్స్ కేంద్రీకరించింది. 2025 కల్లా భారత ఫిట్ నెస్ అండ్ వెల్ నెట్ మార్కట్ 12 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నట్లు అంచనా వేశారు. క్యూర్ ఫిట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ కామర్స్ రంగంలో విస్తరణకు సమున్నత అవకాశాలు ఉంటాయని టాటా సన్స్ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.