FbTelugu

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు: కోవింద్

న్యూఢిల్లీ: సంస్కృతి, సంప్రదాయాలు తెలుగువారికే సొంతమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే రాష్ట్రపతి ట్వీట్టర్ వేదికగా.. ‘‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’ అంటూ తన శుభాకాంక్షలను తెలుగులో పంపడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.