FbTelugu

నిండా ముంచిన అరటి, టమోటా సాగు

* రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతుల ఆవేదన
కర్నూలు: జిల్లాలో టమాటా, అరటిని సాగు చేసిన రైతులు ధరలు లేక నిండా మునిగారు. ఊహించని రీతిలో టమాటా, అరటి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో కిలో టమోటా ధర 1 రూపాయికి పడిపోగా.. అరటి గెల ధర రూ.50 కి పడిపోయింది. దీంతో రవాణా చార్జీలు కూడా రావట్లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.