FbTelugu

సాగునీటి కలలు సాకారమౌతాయి: ఎర్రబెల్లి

వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సంకల్పంతో ప్రజల సాగునీటి కలలు సాకారమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్ లో నీటిని విడుదల చేసిన అనంతరం మాట్లాడారు.

కాళేశ్వరం, ఎస్సారెస్పీ, దేవాదుల జలాలతో బీడు భూములు కూడా సస్యశామలం కానున్నాయని తెలిపారు. తెలంగాణలోనే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్టు తెలిపారు.

You might also like