FbTelugu

సీఎస్ గౌరవిస్తే… పోలీసులు లాఠీఛార్జి

విజయవాడ: వలస కూలీలపై విజయవాడ పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు పెట్టారు.

ఈనెల 15వ తేదీ సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చూసి వివరాలు ఆరా తీశారు. నడిచి ఎందుకు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించి, వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ మేరకు విజయవాడ, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

andhra chief secretary

అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. రహదారిపై వెళ్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు.

వీరిలో కొంతమంది కాలినడకన వెళ్లేవారు, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు. రోజు ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు.

సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు ఆపివేశారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు పెట్టారు. ఆ తరువాత వారందరినీ మళ్లీ విజయవాడ క్లబ్‌కు తరలించి వివరాలు తీసుకుంటున్నారు.

You might also like